ఫైనాన్షియల్ లిట్రసీ, ఎంటీఎస్ పోస్టులకు అప్లకేషన్ల ఆహ్వానం

ఫైనాన్షియల్ లిట్రసీ, ఎంటీఎస్ పోస్టులకు అప్లకేషన్ల ఆహ్వానం

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ పరిధిలోని జిల్లా మహిళా సాధికారత కేంద్రంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిట్రసీ, ఎంటీఎస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రవినాయక్ తెలిపారు. 2 పోస్టులకు జులై 1,2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ళ వయస్సు ఉన్న జిల్లాకు చెందిన వారు అర్హులన్నారు. కనీసం 3ఏళ్లు ప్రభుత్వ సంస్థలో పని చేసిన అనుభవం ఉండాలన్నారు. ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.