కరీంనగర్ టౌన్,వెలుగు: టెన్త్ చదువుతున్న స్టూడెంట్లకు ప్రతిభ ఆధారంగా శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమిలో 100 శాతం ఫీజులో రాయితీ, బహుమతులు ఇస్తున్నామని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో స్టూడెంట్లకు స్కాలర్ షిప్ టెస్టు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ, ఆర్థిక స్థోమత సరిగా లేని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ విద్య అందించేందుకు ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ షిప్ టెస్టుకు 2,403 మంది స్టూడెంట్లు హాజరయ్యారన్నారు. డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్, ఏజీఎం శ్రీనివాస్,లెక్చరర్లు,స్టూడెంట్లు పాల్గొన్నారు.