SRH vs MI: వారెవ్వా ఉప్పల్ మ్యాచ్.. ఒక్క మ్యాచ్‌తో నాలుగు ఆల్‌టైం రికార్డ్స్ బ్రేక్

SRH vs MI: వారెవ్వా ఉప్పల్ మ్యాచ్.. ఒక్క మ్యాచ్‌తో నాలుగు ఆల్‌టైం రికార్డ్స్ బ్రేక్

ఐపీఎల్ మొదలై నాలుగు రోజులు గడిచినా.. క్రికెట్ ప్రేమికులకు సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు మజాను అందించింది. ఉప్పల్ స్టేడియంలో బుధవారం (మార్చి 27) ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పరుగుల వరద పారింది. మొదట సన్ రైజర్స్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ బౌండరీల మోత మోగించారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో ప్రత్యేక మ్యాచ్ గా నిలిచిపోయింది. ఈ ఒక్క మ్యాచ్ లో ఏకంగా నాలుగు ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ కావడం విశేషం.

Also read:నా సీక్రెట్ అదే.. అందుకే చితక్కొడుతున్నా

అత్యధిక స్కోర్:

మొదట బ్యాటింగ్ లో 20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ ఐపీఎల్ లో చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 263 పరుగులతో బెంగళూరు మీద ఈ రికార్డు ఉంది. ఇక మొదటి 10 ఓవర్లలోనూ అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా సన్ రైజర్స్ నిలిచింది. 10 ఓవర్లలో ఎస్ఆర్ హెచ్ మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.  అంతకుముందు ముంబై(133/3)పై ఉన్న రికాడ్డును సన్ రైజర్స్ తన పేర లిఖించుకుంది.

ఛేజింగ్ లో అత్యధిక పరుగులు:

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓడిపోయినా ఛేజింగ్ లో ముంబై ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. చివరి ఓవర్ వరకు తమ పోరాటాన్ని కొనసాగించింది. 278 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ముంబై 246 పరుగులు చేసి సన్ రైజర్స్ కు చెమటలు పట్టించింది. ఛేజింగ్ చేస్తున్నప్పుడు అత్యధిక స్కోర్(246/5) నమోదు చేసిన జట్టుగా ముంబయి రికార్డులకెక్కింది.

ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు:

ఈ మ్యాచ్ మొత్తం 523 పరుగులు నమోదయ్యాయి. చూస్తుంటే ఒక వన్డే మ్యాచ్ లో రెండు జట్లు కోట్టిన స్కోర్ లా కనిపిస్తుంది. దీంతో  ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ గా రికార్డులకెక్కింది. మొదట సన్ రైజర్స్  20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు  చేస్తే.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ 246 పరుగులు చేసింది. 

ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు:

ఈ మ్యాచ్ లో మొత్తం 38 సిక్సర్లు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సులు నమోదైన మ్యాచ్ గా ఈ మ్యాచ్ రికార్డులు సృష్టించింది. ముంబయి ఇండియన్స్ 20 సిక్సులు బాదితే.. హైదరాబాద్ జట్టు 18 సిక్సులు కొట్టింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 69 బౌండిరీలు నమోదు అయ్యాయి.