MI vs KKR: రికెల్ టన్ మెరుపులు..అశ్వని మ్యాజిక్: కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ముంబై

MI vs KKR: రికెల్ టన్ మెరుపులు..అశ్వని మ్యాజిక్: కోల్‌కతాను చిత్తుగా ఓడించిన ముంబై

ఐపీఎల్ సీజన్ 18 లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. ముంబై వాంఖడే వేదికగా జరుగిన ఈ మ్యాచ్ లో కేకేఆర్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ని 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే అయింది. లక్ష్య  ఛేదనలో ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి గెలిచింది. రికెల్ టన్ (41 బంతుల్లో 62: 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్, హర్షిత్ రాణా తలో వికెట్ తీసుకున్నారు.   

ALSO READ | MI vs KKR: అరంగేట్రంలోనే అదరగొట్టిన అశ్వని కుమార్.. తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డ్

117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి రెండు ఓవర్లలో పెద్దగా పరుగులేమీ రాకపోయినా ఆ తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ, రికెల్ టన్ స్కోర్ వేగంగా ఆది స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ముఖ్యంగా రికెల్ టన్ బౌండరీల వర్షం కురిపించాడు. తొలి వికెట్ కు 46 పరుగులు జోడించిన తర్వాత పేలవ ఫామ్ లో ఉన్న రోహిత్ రస్సెల్ బౌలింగ్ లో  13 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ ఆతర్వాత విల్ జాక్స్ తో కలిసి రికెల్ టన్ వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో ఐపీఎల్ లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. జాక్స్ (16) ఔటైనా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ 9 బంతుల్లోనే 27 పరుగులు చేసి మ్యాచ్ ను త్వరగా ముగించాడు.  

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయింది. 23 ఏళ్ళ యువ బౌలర్ అశ్వని కుమార్ విజృంభణకు తోడు మిగిలిన బౌలర్లు సమిష్టిగా రాణించారు. 26 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ కేకేఆర్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీసుకున్నాడు. బోల్ట్, సాంట్నర్, విగ్నేష్ పుతూర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ పడగొట్టారు.