
నాగ్‌పూర్ / అహ్మదాబాద్: విదర్భతో రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్‌లో తడబడి కష్టాల్లో పడింది. ఆకాశ్ ఆనంద్ (67), సిద్ధేశ్ లాడ్ (35) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో.. మంగళవారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లలో 188/7 స్కోరు చేసింది. ఆనంద్‌తో పాటు తనుష్ కొటియాన్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సిద్ధేశ్ లాడ్ (35), శార్దూల్ ఠాకూర్ (37) ఓ మాదిరిగా ఆడారు. విదర్భ బౌలర్ల దెబ్బకు ఆయూష్ మాత్రే (9), కెప్టెన్ రహానె (18), సూర్యకుమార్ (0), శివమ్ దూబే (0) నిరాశపర్చారు.
పార్త్ రేఖడే 3, యష్ ఠాకూర్ రెండు వికెట్లు తీశారు. అంతకుముందు 308/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 107.5 ఓవర్లలో 383 రన్స్‌కు ఆలౌటైంది. యష్ రాథోడ్ (54), అక్షయ్ వాడ్కర్ (34) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం ముంబై ఇంకా 195 రన్స్ వెనకబడి ఉంది.
మహ్మద్ అజారుద్దీన్ సెంచరీ
మహ్మద్ అజారుద్దీన్ (149 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో.. గుజరాత్‌తో మరో సెమీస్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 177 ఓవర్లలో 418/7 స్కోరు చేసింది. రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు అజారుద్దీన్‌తో పాటు ఆదిత్య సర్వాటే (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. 206/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన కేరళ ఇన్నింగ్స్‌లో సచిన్ బేబీ (69), సల్మాన్ నిజర్ (52) హాఫ్ సెంచరీలు సాధించారు. అహ్మద్ ఇమ్రాన్ (24) ఫెయిలయ్యాడు. అర్జాన్ 3 వికెట్లు తీశాడు.