మగాళ్లకు ఏ మాత్రం తగ్గేదేలా.. రన్నింగ్ లోనే రైలు ఎక్కేస్తున్నారు లేడీస్

ముంబై లోకల్ ట్రైన్ అనేక కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు, ఇది ఘర్షణ, మరికొన్ని సార్లు పలు ప్రమాదకరమైన విన్యాసాలు వంటి వాటితో వైరల్ అవుతోంది. ఇప్పుడు, వైరల్‌గా మారిన ఈ వీడియో  'ఎక్స్'లో ప్రత్యక్షమై చాలా మందికి షాక్ ఇచ్చింది. కదులుతున్న లోకల్ రైలు స్టేషన్‌లో ఆగుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అయితే, రైలు ఆగకముందే, సీటును కాపాడుకోవడానికి మహిళలు పరిగెత్తుతూ రైలులోకి ప్రవేశించడం ప్రారంభించారు.

ALSO READ: పూలు కోస్తే రూ.500 ఫైన్.. ఎవరు చూస్తారులే అనుకోవద్దు..

ఈ వీడియో ఈ మహిళల డేంజరస్ స్టంట్‌ను కూడా హైలైట్ చేస్తుంది. ఈ వీడియోలో మహిళలంతా ఒక్కసారిగా రైల్లోకి ప్రవేశించడం చూడవచ్చు. అప్పటికీ రైలు పూర్తిగా ఆగకపోయినా.. సీటు పొందేందుకు పోటాపోటీగా, ఒకరిని మించి మరొకరు పరిగెత్తుకుంటూ రావడం కూడా గమనించవచ్చు. ఈ వీడియో అప్‌లోడ్ చేయబడినప్పటి నుంచి దీనికి 7లక్షల 45వేల వ్యూస్ ను అందుకుంది. "70ల తర్వాత భారీ వలసలకు దారితీసిన బొంబాయి కలను బాలీవుడ్ గ్లామరైజ్ చేసింది" అని ఓ 'X' యూజర్ వ్యాఖ్యానించారు. “అన్నింటికంటే ఇది చాలా ప్రమాదకరమైనది. నేనెప్పుడూ ఇలాంటి రైలు ఎక్కలేదు” అని ఇంకొకరు కామెంట్ చేశారు.