హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ చైర్ పర్సన్ వెంపటి పార్వతమ్మ, వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్ పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. హాలియా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం ప్రకటిస్తూ ఈనెల 13న పలువురు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కు నోటీసు ఇచ్చారు. దీంతో గురువారం మిర్యాలగూడ ఆర్డీవో చెన్నయ్య ఆధ్యవర్యంలో హాలియా మున్సిపాలిటీ ఆఫీసులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పార్వతమ్మ, సుధాకర్ కు వ్యతిరేకంగా 10 మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఓటేశారు. పూర్తి మెజార్టీ ఉండడంతో ఎక్స్ అఫీషీయో మెంబర్గా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జై వీర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం రాలేదు. కొత్త చైర్మన్ ఎన్నిక కోసం త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తారని ఆర్డీవో చెన్నయ్య తెలిపారు.