మునుగోడు ఉపఎన్నిక నామినేషన్ కు ఇవాళే లాస్ట్ డేట్

మునుగోడు  ఉప ఎన్నిక  నామినేషన్ ఇవాళ్టితో  గడువు ముగియనుంది.  ఈ నెల 7న ప్రారంభమైన  నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది.  ఇప్పటి వరకు 56 మంది అభ్యర్ధులు  87 సెట్ల నామినేషన్లు  దాఖలు చేశారు.  నిన్న ఒక్కరోజే  24 మంది  అభ్యర్ధులు 35 సెట్ల  నామినేషన్లు  దాఖలు చేశారు.  రేపు నామినేషన్లను  అధికారులు పరిశీలించనున్నారు. 17వ  తేదీ వరకు  నామినేషన్ల ఉపసంహరణకు  గడువు ఉంది. నంబర్ 3న  పోలింగ్, నవంబర్ 6న ఓట్ల  లెక్కింపు, అదే రోజు  ఫలితాలు రానున్నాయి.

ఇవాళ నామినేషన్ల  దాఖలు  లాస్ట్ డే  కావడంతో  పెద్ద సంఖ్యలో  నామినేషన్లు దాఖలు చేసే చాన్స్ ఉంది.  ఇవాళ కాంగ్రెస్  అభ్యర్ధి   పాల్వాయి స్రవంతి రెడ్డి  భారీ ర్యాలీతో నామినేషన్  దాఖలు  చేయనున్నారు. ర్యాలీలో  పెద్ద సంఖ్యలో  కార్యకర్తలు  పాల్గొనాలని  PCC చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు.  బంగారు గడ్డ  గ్రామం నుంచి  చండూర్ MRO  ఆఫీసు వరకు  భారీ ర్యాలీతో నామినేషన్  వేయనున్నారు  పాల్వాయి స్రవంతి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉన్నారు.