యువత స్వశక్తితో అభివృద్ధి చెందాలి

యువత స్వశక్తితో అభివృద్ధి చెందాలి

నార్కట్​పల్లి, వెలుగు : యువత కేవలం ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వశక్తితో అభివృద్ధి చెందాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. ఆదివారం నార్కట్ పల్లి కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వేదాక్షి ట్రేడర్స్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను అమ్మాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్యగౌడ్, నాయకులు దూదిమెట్ల సత్తయ్య, వడ్డే భూపాల్ రెడ్డి, సట్టు సత్తయ్య, పాశం శ్రీనివాస్ రెడ్డి, జేరిపోతుల భరత్, జొన్నలగడ్డ రాజశేఖర్ రెడ్డి, గడ్డం పశుపతి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 

చండూరు, వెలుగు :మండలంలోని తుమ్మలపల్లి రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం రథోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణాకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వాదం అందించారు. అనంతరం స్వామివారి రథోత్సవాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓంకారం, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆలయ చైర్మన్ రమ్య రామలింగారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.