మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చౌటుప్పల్, వెలుగు : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ మాస్టర్ ప్లాన్ ను నాలుగు రోజుల్లోపు ప్రిపేర్ చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి ఎంత నష్టం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

 అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్​లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ యార్డులో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అందుకోసం మాస్టర్​ప్లాన్​సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మునుగోడు నియోజకవర్గ సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్ , మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, అధికారులు, నాయకులు ఉన్నారు. 

ఎమ్మెల్సీ సత్యంతో కలిసి పనిచేస్తాం

మునుగోడు, వెలుగు : నియోజకవర్గ అభివృద్ధి కోసం సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పనిచేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మునుగోడు పట్టణంలోని పీఆర్ఆర్ గార్డెన్​లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందన సభకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయనను అభినందించారు. సీపీఐకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.