
- మార్చి 27న లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్.. మ్యూజికల్నైట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐపీఎల్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజికల్ నైట్ఈవెంట్జరగనుంది. ఈ నెల 27న రాత్రి 7:30 గంటలకు ఉప్పల్లో లక్నోతో సన్ రైజర్స్ మ్యాచ్ ఉంది. అంతకు ముందు 6.30 గంటలకు తమన్తన మ్యూజిక్బ్యాండ్తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించనున్నాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది. ఈసారి సరికొత్తగా ఐపీఎల్ మ్యాచ్‌లకు ముందుగా ఆయా స్టేడియాల్లో మ్యూజికల్నైట్నిర్వహిస్తోంది. వరుస చిత్రాలతో బిజీగా ఉండే తమన్సీసీఎల్లో తనకు ఇష్టమైన క్రికెట్ ఆడుతూ అదరగొడుతుంటాడు. ఈసారి క్రికెట్ లవర్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు.