
- రైతుల తరహాలో పోరాడుదాం.. ముస్లింలకు అసదుద్దీన్ పిలుపు
- కార్యచరణ ప్రకటించిన ముస్లిం పర్సనల్ లా బోర్డు
- ఈ నెల 30న రాత్రి 9కి కరెంట్ నిలిపేసి నిరసన
- మే 25న మానవహారం.. జూన్ 1న ఇందిరాపార్కు వద్ద ధర్నా
హైదరాబాద్, వెలుగు: వక్ఫ్ (సవరణ) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు పోరాటాన్ని కొనసా గించాలని ముస్లింలకు మజ్లిస్ అధినేత, ఎంపీ అసదు ద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. సంవిధాన్ బచావో.. వక్ఫ్ బచావో.. అనే నినాదంతో ఆల్ ఇండియా ముస్లిం పర్స నల్ లా బోర్డు శనివారం హైదరాబాద్‌లోని దారుసలాంలో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడారు. అగ్రి చట్టాలను వెనక్కు తీసుకునే వరకు రైతులు పోరాడినట్టుగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకూ ముస్లింలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ తలాక్, సీఏఏ, యూఏపీఏ, యూసీసీ అంటూ అంటూ ముస్లిం వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఫైర్ అయ్యారు. హిజాబ్‌ను, షరియత్‌ను చీల్చి బీజేపీ నేతలు ప్రజల మధ్య విద్వేషాలు పెంచి, దేశంలో రిలీజియస్ వార్ మొదలవుతున్నదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కానీ భారత ముస్లింలు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటారని, అందుకే ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. బీజేపీ, ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా హిందు సోదరులు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే, ఈ చట్టంపై సుప్రీం కోర్టు రిలీఫ్ మాత్రమే ఇచ్చిందని, లిమిటేషన్ యాక్ట్ అమలవుతోందన్నారు.
దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వందలాది ఎకరాల వక్ఫ్ భూమి ప్రభుత్వ భూమిగా రికార్డులకు ఎక్కుతోందన్నారు. దేశవ్యాప్తంగా కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టాలని కోరారు. బహిరంగ సభలో ముస్లిం పర్సనల్ లా బోర్డుకు చెందిన మౌలానా ఖాలీద్సైఫుల్లా రహమానీ, డీఎంకే ఎంపీ మహ్మద్ అబ్దుల్లా, మాజీ ఎమ్మెల్యే మహ్మద్ హఫీజ్ ఖాన్, బీఆర్ఎస్ నేత మహమూద్‌అలీ, తెలంగాణ వక్ఫ్ బోర్డు మెంబర్ సయ్యద్ నిస్సార్ హుస్సేన్ హైదర్ ఆగా, మౌలానా మతీనుద్దీన్ ఖాద్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెల్ఫోన్ల టార్చ్ లు వెలిగించి నిరసనకు మద్దతు పలికారు.
ఉద్యమ కార్యాచరణ ప్రకటన
వక్ఫ్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈ బహిరంగ సభలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిం చింది. ఈ నెల 30న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రా ల్లోని అన్ని జిల్లాల్లో 10 నిమిషాల పాటు లైట్లను ఆర్పివేసి నిరసన తెలపనున్నారు. మే18న మైనార్టీ నేతలు, సెక్యులర్ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తర్వాత జిల్లాలవారీగా కూడా ఇదే తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
మే 22న మాసబ్ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్లో మహిళలతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే 25న మధ్యాహ్నం హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో మానవహారం చేపట్టనున్నారు. జూన్ 1వ తేదీన ఇందిరాపార్కు వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. ఆయా జిల్లాల్లో ప్రత్యేకంగా లాయర్లు, ఇతర వర్గాలతోనూ సమావేశాలు నిర్వహించనున్నట్టు లా బోర్డు ప్రకటించింది.