వరంగల్​లో ఆటోలో వ్యక్తి​ హత్య?

వరంగల్​లో ఆటోలో వ్యక్తి​ హత్య?
  • మృతుడు హైదరాబాద్​కు చెందిన వ్యక్తి 
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

హనుమకొండ, వెలుగు: ఆటోలో డెడ్ బాడీ కలకలం రేపిన ఘటన హనుమకొండ హంటర్ రోడ్డులోని వరంగల్ పబ్లిక్ ​క్లబ్ సమీపంలో జరిగింది. స్థానికులు బుధవారం మధ్యాహ్నం ఆటోలో డెడ్ బాడీని చూసి సుబేదారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి విచారణ చేపట్టారు. ఆటోలో లభించిన లైసెన్స్​ ఆధారంగా మృతుడు హైదరాబాద్ లోని బంజారాహిల్స్​ దేవరకొండ బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ ​ముల్కల ఉప్పలయ్యగా గుర్తించారు.

ఆటో( టీఎస్ 09 యూసీ 5534 ) లో మధ్యాహ్నం  డెడ్​ బాడీ కనిపించడంతో పాటు హత్య జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. వరంగల్ సెంట్రల్​జోన్​ డీసీపీ సలీమా, హనుమకొండ ఏసీపీ దేవేందర్​ రెడ్డి, సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉప్పలయ్య ఆటో వెనక సీట్లో మృతిచెంది ఉండడంతో  ఎవరైనా మర్డర్​ చేశారా..? యాక్సిడెంట్​ జరిగి ఉంటుందా..? అనే ప్రశ్నలు తలెత్తతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్టు సుబేదారి సీఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.