మంటల్లో స్ర్కాప్​ డీసీఎం

మంటల్లో స్ర్కాప్​ డీసీఎం
  • మెడికల్​ వేస్ట్​ ఉన్నట్లు అనుమానాలు

జీడిమెట్ల, వెలుగు: స్క్రాప్​తో నిండి ఉన్న ఓ డీసీఎం  మంటల్లో కాలి దగ్ధమైన  ఘటన పేట్​బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.  స్థానికులు  తెలిపిన వివరాల ప్రకారం...  దూలపల్లి రోడ్డు ఫాక్స్​సాగర్​ సమీపంలో కొంత మంది స్ర్క్రాప్​ దుకాణం నిర్వహిస్తున్నాడు.

 ఈ క్రమంలో గురువారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో స్క్రాప్​తో లోడ్​ చేసి ఉన్న డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదవశాత్తు కాలిపోయిందా? ఎవరైనాకావాలని కాల్చారా? అని  తేలాల్సి ఉంది.  కాగా డీసీఎంలో మెడికల్​ వేస్ట్​ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.