హైదరాబాద్లోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ మల్లాపూర్.. నాచారం పారిశ్రామిక వాడలో శనివారం ( సెప్టెంబర్ 7) మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రోడ్ నంబర్ 15లో ఉన్న రాంసన్ పెయింట్ కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పెయింటింగ్ రసాయనాలతో మంటలు, ఘాటైన వాసనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటలను ఆర్పేందుకు మౌలాలి, నాచారం, చర్లపల్లి అగ్నిమాపక సిబ్బంది సుమారు 5 శకటాలతో ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈరోజు సెలవు దినం కావడంతో ఫ్యాక్టరీలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ | పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్