అభిషేక్ నామా దర్శకత్వంలో నాగబంధం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్

అభిషేక్ నామా దర్శకత్వంలో నాగబంధం.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్

‘పెదకాపు’ ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ పిక్చర్స్, ఎన్‌‌ఐకే  స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ  ప్రీ-లుక్ పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు. హీరో పురాతన ఆలయ ద్వారం ముందు నిలబడి ఉన్నట్లుగా దీన్ని డిజైన్ చేశారు.  సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న తను పోషించిన రుద్ర పాత్రను పరిచయం చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌‌లో జరుగుతోంది. నాగబంధం ద్వారా రక్షించబడుతున్న 108 విష్ణు దేవాలయాల  నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నభా నటేష్,  ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘కేజీఎఫ్​’ ఫేమ్  అవినాష్ ఇందులో  అఘోరా పాత్రలో నటిస్తున్నాడు.  జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి  డైలాగ్స్, అభే సంగీతం అందిస్తున్నారు.