
హీరో నాగార్జున నుంచి సినిమా వచ్చి ఏడాది దాటింది. చివరగా గత ఏడాది సంక్రాంతికి ‘నా సామిరంగ’ చిత్రంతో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’, ధనుష్ ‘కుభేర’ చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే సోలో హీరోగా నటించబోయే ఏ సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు. ఆయన కెరీర్‌లో ఇది వందవ చిత్రం కానుండడంతో ఆచితూచి అడుగేస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే ఇటీవల ఓ తమిళ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌కు ఇంప్రెస్ అయిన నాగార్జున.. అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్.
అశోక్ సెల్వన్, రీతూ వర్మ జంటగా ‘నితం ఓరువానం’ అనే చిత్రాన్ని కార్తిక్ తెరకెక్కించాడు. నాగార్జునతో అతను తెరకెక్కించనున్న చిత్రం భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.