సాగర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్​డ్యాం వద్ద మళ్లీ మంటలు

సాగర్‌‌‌‌‌‌‌‌ ఎర్త్​డ్యాం వద్ద మళ్లీ మంటలు

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్ద మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఎర్త్‌‌‌‌‌‌‌‌డ్యాం వెంట ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్యాం వెంట ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్​వైర్లు, గడ్డి పూర్తి కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఫిబ్రవరి 15, 21, మార్చి 19 తేదీల్లో డీ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో అగ్ని ప్రమాదం జరగడంతో వివిధ రకాల భారీ చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. తాజాగా ఆదివారం మరోసారి మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.