- మెస్రం వంశం పూజలు ముగిసినా భక్తుల బారులు
- దర్శనానికి నాలుగు గంటల సమయం
ఆదిలాబాద్, వెలుగు: నాగోబా జనసంద్రమైంది. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంత జనాలు తరలిరావడంతో జాతర పులకరించింది. ఆదివారం కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాదాపు అన్ని కంపార్ట్మెంట్భక్తులతో నిండిపోయాయి.
దర్బార్ రోజు కంటే రెండింతలు భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీతో అప్రమత్తమైన పోలీసులు క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షించారు. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగురామన్న నాగోబాను దర్శించుకున్నారు. నాగోబా జాతర సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మెస్రం వంశీయులు అవార్డులు అందజేశారు.