నాగ్​పూర్​ నుంచి సికింద్రాబాద్​కువందే భారత్

నాగ్​పూర్​ నుంచి సికింద్రాబాద్​కువందే భారత్

 నేడు వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలోని నాగ్​పూర్​ నుంచి  సికింద్రాబాద్​కు వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వర్చువల్​గా ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్​లో జరగనున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేశ్​వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. 

రెగ్యులర్ సర్వీసును ఈ నెల 19 నుంచి నడపనున్నారు. రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌‌‌‌లు, 18 చైర్ కార్ కోచ్‌‌‌‌లు..1,440 సీట్లున్న ఈ రైలు నాగ్‌‌‌‌పూర్ నుంచి  సికింద్రాబాద్ మధ్య 585 కిలో మీటర్ల దూరం 7.15 గంటల్లో చేరుకుంటుంది. నాగ్‌‌‌‌పూర్ నుంచి ఉదయం 5.00 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్‌‌‌‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో   సికింద్రాబాద్‌‌‌‌ నుంచి మధ్యాహ్నం 1 కి బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌‌‌‌పూర్ చేరుకుంటుంది. మార్గమధ్యలో రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్హర్షా, రామగుండం, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఆగనుంది.