
చిట్యాల, వెలుగు: తిరుమలనాథ స్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో కొండపై భూదేవి సమేత తిరుమలనాథ స్వామి కల్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు తీసుకువచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, దేవాలయాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. అనంతరం గ్రామంలో రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఓర్సు రాజ్ కుమార్, కాటం వెంకటేశం, ఎర్పుల నర్సింహ, ఏదుళ్ల అజిత్ రెడ్డి, జెల్ల నర్సింహ, మర్రి జలంధర్ రెడ్డి, పూజారి శైలేంద్ర శర్మ తదితరులు పాల్గొనారు