నల్గొండ జిల్లాలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా

నల్గొండ జిల్లాలో  ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా

నల్గొండ అర్బన్, వెలుగు: యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం సంబంధిత పోస్టర్​ఆవిష్కరించారు. 

పదోతరగతి, ఇంటర్ , డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, పీజీ చదివిన 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.