- బైక్ ఎక్కిన యువతితో అసభ్య ప్రవర్తించినందుకు..
జూబ్లీహిల్స్, వెలుగు: బైక్ఎక్కిన యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ర్యాపిడో రైడర్‌కు నాంపల్లి కోర్టు 7 రోజులు జైలు శిక్ష విధించింది. సిటీకి చెందిన ఓ యువతి గురువారం ర్యాపిడో యాప్‌లో రైడ్బుక్చేసింది. మహ్మద్సులేమాన్అనే రైడర్ఆమెను ఎక్కించుకుని, కొద్దిదూరం వెళ్లాక ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంటనే బైక్దిగిపోయిన బాధితురాలు నేరుగా ఫిల్మ్నగర్పీఎస్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మహ్మద్సులేమాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. సులేమాన్‌కు కోర్టు 7 రోజులు జైలు శిక్ష విధించినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు.