రెండు పార్ట్లుగా నాని ప్యారడైజ్..నిజమేనా?

రెండు పార్ట్లుగా నాని ప్యారడైజ్..నిజమేనా?

నాని హీరోగా  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో   ‘దసరా’ తర్వాత రూపొందుతోన్న మరో  క్రేజీ  ప్రాజెక్ట్  ‘ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల ‘రా స్టేట్‌‌మెంట్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్, అందులోని నాని లుక్, డైలాగ్స్   సినిమాపై అంచనాలు పెంచేశాయి.  తాజాగా ఈ మూవీపై ఇంటరెస్టింగ్ న్యూస్‌‌లు  చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి ట్రెండ్‌‌కు తగ్గట్టుగానే, అలాగే ఈ కథకు ఎక్కువ స్పాన్ ఉండటంతో రెండు పార్ట్స్‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.  

మొదటి భాగం వచ్చే ఏడాది మార్చి 26న, రెండో పార్ట్ వచ్చే ఏడాది చివరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే దీన్ని రెండు భాగాలు తెరకెక్కించడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గ్లింప్స్‌‌లో రిలీజ్ చేసిన డైలాగ్స్‌‌ ఆధారంగా ఇందులో నాని ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదొక  కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. పాన్ వరల్డ్‌‌ మూవీగా రిలీజ్‌‌కు రెడీ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.