5 కిలోల బరువు తగ్గిన చంద్రబాబు, ప్రాణాలకు ప్రమాదం : భువనేశ్వరి

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఎమర్జెన్సీ హెల్త్‌ ట్రీట్మెంట్‌ అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ మేరకు నారా భువనేశ్వరి ట్వీట్‌ చేశారు. ''నా భర్త జైలులో ఉన్న సమయంలో ఆయనకు అత్యవసరంగా అవసరమైన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనందున, నా భర్త క్షేమం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. అతను ఇప్పటికే 5 కిలోల బరువు కోల్పోయాడు. ఇంకా చంద్రబాబు బరువు తగ్గితే అతని కిడ్నీలపై ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు. జైలులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్త జీవితానికి స్పష్టమైన, తక్షణ ముప్పును తలపెట్టేలా ఉన్నాయి'' అని అన్నారు.

ALSO READ : అక్టోబర్ 14 సూర్య గ్రహణం... ఈ ఐదు రాశుల వారికి అదృష్టమే అదృష్టం