
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ లోని బీజేపీ ఆఫీస్‌ను ఆ పార్టీలోని ఓ వర్గానికి చెందిన కార్యకర్తలు ధ్వంసం చేశారు. తమను గుర్తించడం లేదంటూ అద్దాలు, కుర్చీలు పగలగొట్టారు. ఈనెల 8న వరంగల్ లో ప్రధాని మోదీ సభ సక్సెస్ చేసేందుకు గురువారం పార్టీ ఆఫీసులో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
మీటింగ్‌కు బీజేపీ నియోజకవర్గ లీడర్రాణా ప్రతాప్‌రెడ్డి వర్గానికి చెందిన 20 మంది కార్యకర్తలు వచ్చి కూర్చున్నారు. వీరు మధ్యలో లేచి పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. జితేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అశోక్‌ల సమక్షంలోనే కుర్చీలు, అద్దాలు పగలగొట్టారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై బొజ్జ రవీందర్ అక్కడికి వచ్చి పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించామని, పోలీసులకు కంప్లయింట్చేయనున్నట్లు బీజేపీ లీడర్లు మీడియాకు చెప్పారు.