అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు : దొంతి మాధవరెడ్డి

నర్సంపేట, వెలుగు : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నర్సంపేట మండలం పర్శునాయక్​తండా, ఖానాపురం మండలం రాగంపేటలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేసి, పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన క్యాంప్​ ఆఫీస్​లో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన పొదుపు మహిళలకు రూ.11 కోట్ల వడ్డీ లేని రుణాలను అందజేశారు.

 నియోజకవర్గానికి మంజూరైన 6 బస్సులకు మండలానికి ఒకటి చొప్పున ప్రతి మండల సమాఖ్యకు రూ.30 లక్షల సబ్సిడీ చెక్కును అందించారు. చెన్నరావుపేట మండలంలోని అక్షయ మహిళా రైతు ఉత్పత్తి సంఘానికి, ఖానాపురం భారతీయ మహిళ రైతు ఉత్పత్తి సంఘానికి గోదాంల నిర్మాణం కోసం మంజూరైన రూ.30 లక్షల (ఒక్కొకంటి15 లక్షల చొప్పున) చెక్కులు సంఘాల బాధ్యులకు అందించారు. కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్​ కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.