పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్

  • మూడేళ్ల కఠిన శిక్షణ తర్వాత.. పాసింగ్ అవుట్ పరేడ్

పుణె: స్థానిక నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 142వ కోర్స్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగింది. మూడేళ్ల కఠిన శిక్షణ తర్వాత 142వ కాడెట్స్ పాసింగ్ అవుట్ పరెడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్.. వివేక్ రామ్ చౌదరి పర్యవేక్షించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న క్యాడెట్లు ఖేత్రపాల్ గ్రౌండ్ లో పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు. 
వైట్ సమ్మర్ యూనిఫాంలో కాడెట్లు తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శించారు. వెనక చారిత్రక సింహగఢ్ ఫోర్ట్, ముందు గ్రౌండ్ లో కాడెట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. మిలటరీ బ్యాండ్ కొనసాగుతుండగా క్యాడెట్లు తమ ప్రదర్శన చూపారు. ఈ కార్యక్రమంలో పాసింగ్ అవుట్ పరేడ్ చేసిన క్యాడెట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఏడాది రెండు బ్యాచుల క్యాడెట్స్ పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతుంది. వీరిని త్రివిధ దళాల్లో సేవల కోసం ట్రైనప్ చేస్తారు. 

 

ఇవి కూడా చదవండి

వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం

సర్కార్ వారి పాట సినిమా చూస్తా