గ్రాండ్ గా నేషనల్​ డెంటిస్ట్స్​​ డే

 గ్రాండ్ గా నేషనల్​ డెంటిస్ట్స్​​ డే

హనుమకొండ, వెలుగు: నేషనల్​ డెంటిస్ట్​ డే సందర్భంగా ఇండియన్​ డెంటల్​అసోసియేషన్​ వరంగల్ ​బ్రాంచ్​ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ నుంచి పబ్లిక్​ గార్డెన్​లోని నేరెళ్ల వేణుమాధవ్​కళాప్రాంగణం వరకు గురువారం 2కె వాకథాన్​​ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్​ రెడ్డి 2కే వాకథాన్​ ను ప్రారంభించగా, ఎంపీ కడియం కావ్య, తెలంగాణ మెడికల్ కౌన్సిల్​ పబ్లిక్​ రిలేషన్స్​ కమిటీ చైర్మన్​ వి.నరేశ్​ చీఫ్​ గెస్ట్​ గా హాజరయ్యారు. 

కార్యక్రమంలో వరంగల్ డెంటిస్ట్ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ డా.రాంప్రసాద్​ రెడ్డి, సెక్రటరీ డా.వేణుమాధవ్, ట్రెజరర్ డా.కార్తీక్, సీనియర్​ డెంటిస్ట్స్ డా.జయసింహరెడ్డి, డా.అనిల్​ రెడ్డి, డా.సురేందర్​ రెడ్డి, డా.మనోరంజన్​ రెడ్డి, డా.రమేశ్​ బాబు, డా.రజనీకాంత్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.