ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు

ఘనంగా అగ్నిమాపక వారోత్సవాలు
  • రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించిన అగ్ని మాపక సిబ్బంది 

మేళ్లచెరువు, వెలుగు: అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వేసవి కాలంలోనే జరుగుతాయని, అప్రమత్తంగా ఉండాలని మేళ్ల చెరువు మైహోం పరిశ్రమ యూనిట్ హెడ్ నందనమూడి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం స్థానిక మైహోం పరిశ్రమలో డైరెక్టర్ జూపల్లి రంజిత్ రావు ప్రారంభించారు. అగ్ని ప్రమాద నిరోధక చర్యలు, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  అవగాహన కరపత్రాన్ని విడుదల చేసి కార్మికులకు అందజేశారు.  ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివరావు,ఆపరేషన్స్ డైరక్టర్ చంద్రశేఖర్ పాండే, జీఎంలు పాల్గొన్నారు.

హుజూర్ నగర్, వెలుగు: అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ వాల్ పోస్టర్ ఆవిష్కరించి హుజూర్ నగర్ లో ప్రారంభించారు. ఫైర్ అధికారులు రవిబాబు, దేశ్య, నాగేశ్,  నరసింహారావు   పాల్గొన్నారు.  

సూర్యాపేట, వెలుగు: అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ పి. రాంబాబు అన్నారు.  సోమవారం జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ లో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వాల్ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు.