ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధం

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధం
  • ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం 

వెలుగు, నెట్ వర్క్ :  ఓటు హక్కు ఎంతో విలువైందని దాన్ని ఉపయోగించి సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని పలువురు వక్తలు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఓటరు దినోత్సవ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ తీశారు. 

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఆయుధమని దాన్ని సరిగా వినియోగించుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో  వివిధ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు  పాల్గొన్నారు.