నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గురువారం నవీన్ పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ టీజర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నవీన్ పొలిశెట్టి పోషించిన క్యారెక్టర్, తన లుక్ కంప్లీట్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. రాజు పాత్ర నవీన్ వివాహానికి సిద్ధమవుతున్నట్లుగా చూపించారు. రాజు గారి పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది.
ఇక అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడటం ఫన్నీగా ఉంటుంది. అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో పెళ్లి కూతురిగా హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించింది. ఈ ఫోటోషూట్‌లో కూడా నవీన్ తనదైన పంచ్‌లతో అలరించాడు. ముఖ్యంగా ఈ వీడియోలో నవీన్ కామెడీ టైమింగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడంతోపాటు మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ ఆకట్టుకుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.