
- పోలీసులపై నవనీత్ కౌర్ సంచలన ఆరోపణలు
ముంబయి సెషన్స్ కోర్టులో ఎంపీ నవనీత్ రాణా దంపతుల బెయిల్ పిటిషన్ పై విచారణ ఈనెల 29కి వాయిదా పడింది. దీంతో ఈనెల 29 వరకు జైలులోనే ఉండనున్నారు ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతులు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు. సెక్షన్ 353 కింద తమపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కొట్టివేయాలని వేసిన రిట్ పిషన్ ను ఇప్పటికే తిరస్కరించింది బాంబే హైకోర్టు. దీంతో బెయిల్ పిటిషన్ పై ముంబై సెషన్స్ కోర్టులో విచారణ జరగగా... పిటిషన్ ను ఈనెల 29న విచారించాలని కోర్టు నిర్ణయించింది.
ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతాయుతంగా వ్యవవహరించాలని చెప్పింది బాంబే హైకోర్టు. శాంతి భద్రతల పరిరక్షణకు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కరెక్టే అని చెప్పింది. హనుమాన్ చాలీసా పారాయణం వివాదంపై అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రాణా దంపతుల బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది బాంబే హైకోర్టు. సెక్షన్ 353 కింద తమపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని వేసిన రిట్ పిషన్ ను తిరస్కరించింది బాంబే హైకోర్టు.
స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన స్పీకర్ కార్యాలయం
మరోవైపు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ నవనీత్ రాణా ముంబై పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఎస్సీ అని తనను దర్భాషలాడారని.. కనీసం బాత్ రూం కూడా వాడుకోనివ్వలేదని... లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు నవనీత్ రాణా. తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదని.. ముంబై పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ నవనీత్ కౌర్ రాణా అరెస్టు పైన.. స్పీకర్ ఆఫీస్ స్పందించింది. లేఖలో ఆమె చేసిన ఆరోపణలపైనా.. 24 గంటల్లో తమకు నివేదిక ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి
జార్ఖండ్ విద్యుత్ సంక్షోభంపై సాక్షి ధోనీ గరం గరం
మళ్లీ ‘మాస్క్ లు’ తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు