ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు కేంద్ర నవోదయ స్కూల్ లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఫ్లెక్సీ కడుతుండగా నలుగురు విద్యార్థులకు విద్యుత్ షాక్ తగిలింది. ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
చనిపోయిన దుర్గా నాగేందర్ ది లోక్యా తండా. ఈ విషయం తెలసుకున్న తండా వాసులు నవోదయ స్కూల్ లో విధ్వసం సృష్టించారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగాయి విద్యార్ధి సంఘాలు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థి సంఘాలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్డీవో స్కూల్ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.