
జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని నవ్య గర్ల్స్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఫేర్‌వెల్ డేను ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్ డ్యాన్సులు అలరించాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీపాద నరేశ్, ప్రిన్సిపాల్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు అన్నిరంగాల్లో ముందుండాలని చెప్పారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.