
నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం ‘టెస్ట్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఎస్.శశికాంత్ దర్శకుడు. శుక్రవారం నయనతార పాత్రను పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె మాధవన్‌కు జంటగా, కుముద అనే స్కూల్ టీచర్ పాత్రను పోషిస్తోంది. ‘ఫెయిల్యూర్ అనేది ఈ టీచర్‌కు ఆప్షన్ కాదు. కుముద మోస్ట్ ఛాలెంజింగ్ టెస్ట్‌ను ఎదుర్కోబోతోంది’ అనే క్యాప్షన్‌తో వీడియోను రిలీజ్ చేశారు.
‘ఒకే ఒక కల, ఓ చిన్న ఇల్లు, భర్తతో గడిపే మధుర క్షణాలు, ప్రేమగా అమ్మ అనే పిలుపు’ అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. నువ్వు స్టూడెంట్స్‌కు టీచర్‌వి మాత్రమే, వాళ్ల తల్లివి కాదు అని స్కూల్ ప్రిన్సిపల్ ఆమెను మందలించడం, తల్లి అవడానికి నీకిదే చివరి అవకాశం అని డాక్టర్ చెప్పే సీన్స్‌తో అమ్మ అని పిలిపించు కోవడానికి ఆమె ఎంతలా తాపత్రయ పడుతున్నది చూపించారు. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌కు, తల్లి అవ్వాలనే
ఆమె ఎమోషన్‌కు సంబంధం ఏమిటనేది మిగతా కథ. చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది ప్రధాన కథాంశం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అయినప్పటికీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉండబోతోందని అర్థమవుతోంది. ఏప్రిల్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది.