వామ్మో అక్కడ బిర్యానీ తింటే... ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిందే..నెక్లస్​ రోడ్​ రైల్​ కోచ్​ రెస్టారెంట్ లో బొద్దింకల బిర్యానీ​

వామ్మో అక్కడ బిర్యానీ తింటే... ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిందే..నెక్లస్​ రోడ్​ రైల్​ కోచ్​ రెస్టారెంట్ లో బొద్దింకల బిర్యానీ​

హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు లోని రైల్ కోచ్ రెస్టారెంట్ లోని ఫుడ్​ లో బొద్దింకలు రాజ్యమేలుతున్నాయి.  చూడడానికి రైలులా  ఉండే రైల్​ కోచ్​ రెస్టారెంట్​ కష్టమర్ల.. ఆరోగ్యం విషయంలో  హోటల్​ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుంది.  దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 

చూడటానికి వెరైటీగా ఉందని నెక్లస్​ రోడ్​లోని రైల్​ కోచ్​ రెస్టారెంట్​ కు బిర్యానీ తినేందుకు వెళుతున్నారా.. అయితే ముందుగానే ఆస్పత్రిలో బెడ్​ బుక్​ చేసుకోవాల్సిందేనని ఈ సంఘటన బట్టి అర్దమవుతుంది.  ఫుడ్​ సేఫ్టీ అధికారులు ఎన్ని దాడులు చేసిన రెస్టారెంట్​ యాజమాన్యాలు క్లీనింగ్​ విషయంలో మాత్రం  మారడం లేదు.  కుళ్లిపోయిన కూరగాయలు.. కాలం చెల్లిన పదార్ధాలు.. బొద్దింకలతో ఆహారం ఇలా ఒకటేమిటి అంతా చెత్తగా ఉంటున్నాయి రెస్టారెంట్లు.. హోటళ్లు.

తాజాగా విజయ్​ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి నెక్లెస్ రోడ్డు లోని రైల్ కోచ్ రెస్టారెంట్ కు లంచ్​చేసేందుకు వెళ్లాడు. ఆ హోటల్లో బిర్యానీ ఆర్డర్​ ఇచ్చారు.  వేడి వేడిగా తీసుకొచ్చిన బిర్యానీని సగం తిన్నారు.  అప్పుడే అసలువిషయం బయట పడింది.  తింటున్న బిర్యానీలో బొద్దింక రావడంతో షాక్​ అయిన కష్టమర్​ .. రెస్టారెంట్​ నిర్వాహకులను నిలదీశాడు. ఫుడ్​ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు  చేస్తానని రెస్టారెంట్​ బాధితులు తెలిపారు.