లింగంపల్లి చోరీ కేసులో నేపాల్​కు పోలీసులు?

లింగంపల్లి చోరీ కేసులో నేపాల్​కు పోలీసులు?

బషీర్​బాగ్, వెలుగు: కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లింగంపల్లి చౌరస్తా లో వ్యాపారి హేమరాజు ఇంట్లో చోరీ జరగడం.. అదే ఇంట్లో  పనిచేసే ఐదుగురు నేపాలీలను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

వీటిలో మూడు బృందాలు రాష్ట్రంతోపాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలిస్తుండగా మరో బృందం నేపాల్ వెళ్లినట్లు సమాచారం. నిందితులు నేపాల్​లోని స్వగ్రామానికి చేరుకున్నట్లు పోలీసులకు సమాచారం రావడం వల్లే అక్కడికి వెళ్లినట్లు తెలిసింది. నిందితులకు నగరానికి చెందిన ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.