పాకిస్తాన్‌తో జరుగుతోన్న ఆసియా కప్ 2023 తొలి పోరులో నేపాల్ మంచి ఆరంభమే చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ మంచి జోరు కనబరుస్తోంది. బౌలర్లు లైన్ అండ్ లెన్త్ బంతులు వేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేస్తుంటే.. ఫీల్డర్లు కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆశ్చర్యపరుస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ ఫఖర్ జమాన్(14) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్(5) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించిన ఫఖర్.. ఆ తరువాత దాన్ని కొనసాగించలేకపోయాడు. అనవసరపు షాట్‍కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ALSO READ :ఒకరికి జ్వరం.. మరొకరి గాయం.. ఆసియా కప్ నుండి మరో ఇద్దరు ఔట్
నేపాల్ కెప్టెన్ మెరుపు త్రో
ఫఖర్ జమాన్ ఔటైన కాసేపటికే మరో ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్.. కూడా లేని పరుగు కోసం ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. సోంపాల్ కమీ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని మిడ్-ఆఫ్ వైపు ఆడిన ఇమామ్.. సింగిల్ కోసం కాల్ చేశాడు. అంతలోనే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న నేపాల్ కెప్టెన్ ఫీల్డింగ్ పౌడెల్.. బంతిని చేతికందుకొని నేరుగా వికెట్లను గురిపెట్టి కొట్టాడు. నేపాల్ క్రికెటర్లను తక్కువ అంచనా వేసిన ఇమామ్.. తల వంచుకుని పెవిలియన్ బాట పట్టాడు. అందుకే సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Once again the responsibility is on Babar and Rizwan .!
— Pankaj dixit (@pankaj_dixit08) August 30, 2023
Go Nepal ?#AsiaCup2023#PAKvsNEP#RakshaBandhan pic.twitter.com/aylgVeyy5b