
గచ్చిబౌలి/జీడిమెట్ల, వెలుగు: ఇంటి నిర్మాణానికి, పిల్లల చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేక రాయదుర్గం పీఎస్పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నేపాల్ కు చెందిన ఖడ్కా బహదూర్(49) బతుకుదెరువు సిటీకొచ్చి రాయదుర్గం మధురానగర్‌లో ఉంటున్నాడు. షాగౌస్ రెస్టారెంట్లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ముగ్గురు కొడుకులు, రెండో భార్యకు ఒక కుమారుడు సంతానం.
ఖడ్కా బహదూర్ ప్రస్తుతం రెండవ భార్య మమతా మహంతితో కలిసి ఉంటున్నాడు. గతంలో సొంతూరులో ఇల్లు కట్టేందుకు, పిల్లల చదువు కోసం, భూమి కొనుగోలు చేసేందుకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చేందుకు జీతం చాలకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
లవ్ ఫెయిల్ అయ్యి యువకుడు
లవ్ప్రపోజ్చేయగా, యువతి నిరాకరించడంతో ఓ యువకుడు ఐదో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్బషీరాబాద్పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని కాంచీపురానికి చెందిన అముదన్ విజయ్(23) ఐటీ ఉద్యోగి. కొంపల్లిలోని కీర్తిరెడ్డి హాస్టల్లో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్చేస్తున్నాడు. ఇతని తల్లిదండ్రులు కుటుంబ కలహాలతో విడిపోయారు. తండ్రి అముదన్సెల్వన్సౌదీఅరేబియాలో ఉంటుండగా తల్లి తమిళనాడులో ఉంటుంది. విజయ్ కు చిన్ననాటి స్నేహితురాలు అంటే ఇష్టం. ఇటీవల ఆమెకు లవ్ప్రపోజ్చేయగా, ఇన్నేండ్లు తాను స్నేహితుడిగానే చూశానని, ప్రేమించలేదని చెప్పింది. మనస్తాపానికి గురైన విజయ్ రెండు రోజులుగా హాస్టల్గదికే పరిమితం అయ్యాడు. 6 పేజీల సూసైడ్ నోట్‌రాసి ఆదివారం రాత్రి హాస్టల్ బిల్డింగ్ఐదో ఫ్లోర్‌నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.