జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నాహాల్లో భాగంగా నెదర్లాండ్స్, నమీబియా జట్లు SA20 జట్లతో వరుస వార్మప్ మ్యాచ్‌లు ఆడుతున్నాయి. బుధవారం (జనవరి 10) నుంచి SA20 లీగ్ సీజన్ 2 ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభానికి ముందు అటు SA20 లీగ్ లో పాల్గొనబోయే జట్లకు, ఇటు నెదర్లాండ్స్, నమీబియా జట్లకు ప్రాక్టీస్ లభించనుంది. జనవరి 5 నుంచి ఈ మ్యాచ్ లు ప్రారంభం కాగా.. జనవరి 13 వరకు జరుగుతాయి.
ప్రపంచంలోని కొంతమంది అగ్రశ్రేణి క్రికెటర్లతో నెదర్లాండ్స్, నమీబియా జట్లు తలపడేందుకు ఆసక్తి చూపించాయి. నెదర్లాండ్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్‌లతో.. నమీబియా జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో వార్మప్ మ్యాచ్ లు ఆడతాయి. SA20లో జట్లన్నీ పటిష్టంగా ఉన్నాయని.. USA, వెస్టిండీస్‌లో వేదికగా జరిగే ప్రపంచ కప్ ఈవెంట్‌కు తమ జట్టుకు ఈ ప్రాక్టీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని..నమీబియా ప్రధాన కోచ్ పియర్ డి బ్రూయిన్ అన్నారు.
బెట్‌వే SA20 లీగ్ కమీషనర్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జరిగే ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో విజయం సాధించాలని చూస్తున్న అసోసియేట్ జట్లకు ప్రాక్టీస్ మ్యాచ్ లను అందించడం పట్ల లీగ్ థ్రిల్‌గా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. బుధవారం SA20 ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తో జోబర్గ్ సూపర్ కింగ్స్ తలపడనుంది. మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 10 న ముగుస్తుంది.
#Netherlands, #Namibia use #SA20 as ICC Men’s T20 World Cup preparation
— Cricket Fanatic (@CricketFanatik) January 7, 2024
Read: https://t.co/U6yei1NSDP pic.twitter.com/rymh6wxOtZ