తిరుపతిలో షోరూం నుంచి అప్పుడే కొనుగోలు చేసిన కారు బీభత్సం సృష్టించింది. కారును కొన్న వ్యక్తి డ్రైవ్ చేశాడు. అయితే బ్రేక్ వేయబోయే క్రమంలో అతను ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో కారు రయ్యమంటూ రోడ్డు పక్కన షాప్ లోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కనే ఉన్న మరో నాలుగు బైకులను ఢీకొట్టింది. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.
షోరూం నుంచి కొత్త కారు తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కారు కొనుగోలు చేసిన వ్యక్తికి డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
.