వరంగల్​ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు .. 25.41కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

వరంగల్​ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు .. 25.41కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

కాశీబుగ్గ, వెలుగు:  కేంద్ర ప్రభుత్వ అమృత్​ మిషన్​లో భాగంగా  సోమవారం వరంగల్​ రైల్వే స్టేషన్​కు కొత్త హంగులు రానున్నాయి. సోమవారం రూ. 25.41 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.   ముఖ్య​అతిథిలుగా బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎంపీ, దయాకర్​, బల్దియా మేయర్​ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ..  రూ.25.41కోట్లతో వివిధ వసతులను కల్పించడం కోసం 12 మీటర్ల వెడల్పుతో ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి, మూడు ఎస్కలేటర్లు, మూడు లిప్టులు ఏర్పాటు  కోసం   శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. 

ALSO READ : నీళ్ల కష్టాలు రాకుండా ముందస్తు ప్లాన్

అలాగే అమృత్​ మిషన్​లో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్​కు చోటుదక్కడం చాల సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిటీలోని పలు డివిజన్లలోని కార్పొరేటర్లలు, రైల్వే మేనేజర్​, రైల్వే పోలీస్​ సిబ్బంది తదితరులు ఉన్నారు.