
చార్లీ ఎవరు?
టైటిల్ : ధూమ్ ధామ్, ప్లాట్ ఫాం : నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్ : రిషబ్ సేథ్
కాస్ట్ : యామీ గౌతమ్, ప్రతీక్ గాంధీ, ఇజాజ్ ఖాన్
ముంబై వీధుల్లో ఒక రాత్రి జరిగే కథ ఇది. కోయల్ (యామి గౌతమ్), వీర్ (ప్రతీక్ గాంధీ) పెద్దలు కుదిర్చిన పెండ్లి చేసుకుంటారు. అది కూడా చాలా హడావిడిగా జరిగిపోతుంది. పెళ్లి జరిగిన రోజు రాత్రే ఇద్దరు వ్యక్తులు వాళ్ల ఇంటికి వస్తారు. వచ్చినవాళ్లు ‘చార్లీ’ అనే వ్యక్తి కోసం వెతుకుతుంటారు. అయితే.. అతను వీర్‌తో ఉన్నాడనే అనుమాంతో వాళ్లు అతని ఇంటికి వస్తారు. కానీ.. వీర్, కోయల్ ఏదో విధంగా వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోతారు. అప్పటినుంచి ముంబై వీధుల్లో చేజింగ్ మొదలవుతుంది. తుపాకీ పట్టుకున్న కొందరు గూండాలు వాళ్లను వెంబడిస్తూనే ఉంటారు. అసలు చార్లీ ఎవరు? అతనితో వీర్‌కి సంబంధం ఏంటి? అతను చేసిన తప్పేంటి? తెలియాలి అంటే సినిమా చూడాలి.
అలా అనుకోకుండా..
టైటిల్: కాదలిక్క నేరమిల్లై, ప్లాట్ ఫాం: నెట్‌ఫ్లిక్స్
డైరెక్షన్: కిరుతిగ ఉదయనిధి, కాస్ట్: నిత్యా మీనన్, రవి మోహన్, టీజే భాను, జాన్ కొక్కెన్, లాల్, యోగి బాబు, వినయ్ రాయ్
శ్రేయ (నిత్య) చెన్నైలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తుంటుంది. ఆమెకు స్వతంత్ర భావాలు ఎక్కువ. కరణ్ (జాన్ కొక్కెన్)ని ప్రేమిస్తుంది. కానీ.. నిశ్చితార్థం తర్వాత అతని గురించి కొన్ని నిజాలు తెలియడంతో దూరమవుతుంది. ఆ తర్వాత టెస్టు ట్యూబ్ పద్ధతి ద్వారా ఒక మగ బిడ్డని కంటుంది. కానీ.. తన బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు సిద్ధార్థ్ ( రవి మోహన్) బెంగుళూర్లో ఉంటాడు. అతను కూడా ఆర్కిటెక్ట్. నిరుపమ (భాను)తో ప్రేమలో ఉంటాడు.
వాళ్లు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. కానీ.. సిద్ధార్థ్‌కి పిల్లలు కనడం ఇష్టం లేకపోవడంతో నిరుపమ అతనికి దూరమవుతుంది. ఆ తర్వాత ఎనిమిదేళ్లకు సిద్ధార్థ్ పనిమీద చెన్నైకి వెళ్తాడు. అక్కడ శ్రేయ పరిచయం అవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శ్రేయ బిడ్డకు తండ్రి ఎవరు? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
ప్రేమలో మలుపు.. గెలుపు
టైటిల్ : బాబీ ఔర్ రిషి కి లవ్ స్టోరీ
ప్లాట్ ఫాం : జియో హాట్‌స్టార్, డైరెక్షన్ : కునాల్ కోహ్లీ
కాస్ట్ : కావేరి కపూర్, వర్ధన్ పూరి, లిలియెట్ దూబే
రిషి(అమ్రిష్ పురి మనవడు వర్ధన్ పూరి) ఎంబీఏ గ్రాడ్యుయేట్. అతను ఫ్లైట్‌లో గ్లాస్గో నుంచి కార్డిఫ్‌కు వెళ్తుంటాడు. కానీ.. వాతావరణం సరిగా లేకపోవడంతో ఫ్లైట్‌ని హీత్రో ఎయిర్‌పోర్ట్‌కి మళ్లిస్తారు. దాంతో రిషి ఒకరోజు అక్కడే ఉండాల్సి వస్తుంది. అక్కడే అతను బాబీ (ప్రొడ్యూసర్ శేఖర్ కపూర్, నటి సుచిత్ర కృష్ణమూర్తిల కూతురు కావేరి)ని కలుస్తాడు. రిషి మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. మొదట్లో బాబీకి రిషి నచ్చడు. కానీ.. కొన్ని నిమిషాల తర్వాత ఇష్టం కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేదే అసలు కథ.