
- మనోహరాబాద్‌లో పసుపు ఆధారిత పరిశ్రమ విజిట్
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ నగరంలోని నేషనల్ పసుపు బోర్డు సెక్రటరీగా ఎన్.భవానీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ఢిల్లీ నుంచి వచ్చారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌లోని పసుపు ఆధారిత పరిశ్రమను ఆమె పరిశీలించారు.
ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్‌లో భాగంగా రూ.3 కోట్ల వ్యయంతో రైతులు సంఘాలు ఏర్పడి నిర్వహిస్తున్న అనుబంధ పరిశ్రమలను చూసి ఆమె సంతోషం వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని టర్మరిక్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించి, సెంటర్ అందిస్తున్న సేవలను సైంటిస్ట్ మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పైస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్, తిరుపతిరెడ్డి ఉన్నారు.