
- ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు : వక్ఫ్ బోర్డు ఆస్తులను ఇన్నాళ్లు ఓవైసీ బ్రదర్స్దొంగచాటుగా అనుభవించారు.. కొందరు కాంగ్రెస్ లీడర్లు కేంద్రం రూపొందించిన కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు...’ అని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం నగరంలోని బీజేపీ ఆఫీస్‌లో ఎంపీ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ఆస్తుల రక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చిందన్నారు. హైదరాబాద్ చుట్టూ వక్ఫ్ భూములుగా చెబుతున్నవాటిలో చాలా భాగం ఇతరుల నుంచి లాక్కున్నవే ఉన్నాయన్నారు.
1995, 2013లో కాంగ్రెస్ సర్కార్ వక్ఫ్ బోర్డుకు ఇచ్చిన జుడిషియల్ పవర్స్‌తో చాలా మందికి నష్టం వాటిల్లిందన్నారు. ఒక ఆస్తిని వక్ఫ్ బోర్డు తనదిగా ప్రకటిస్తే ఎవరూ ఏమీ చేయలేని రీతిలో కాంగ్రెస్ సర్కార్ అధికారాలు కట్టబెట్టిందన్నారు. ఈ సూపర్ పవర్స్‌తో వక్ఫ్ బోర్డు ప్రతినిధులు గవర్నమెంట్ భూములు సొంతం చేసుకున్నారని ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు లాక్కొని ఖాతాలో వేసుకున్నారన్నారు.
అప్పీల్ చేసుకోడానికి వీలులేని అధికారాలు చెలాయించి దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇందులో ఓవైసీ బ్రదర్స్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమాల వల్ల వక్ఫ్ ఇన్కమ్ గడిచిన ఆరేళ్లలో గణనీయంగా తగ్గిందన్నారు. గతంలో సున్నీ తెగకు చెందిన వారే బోర్డులో సభ్యులుగా ఉండేవారని కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో అన్ని వర్గాల ప్రజలు సభ్యులుగా
ఉంటారన్నారు.
కోడి ప్రతి రోజు కూసినట్లు..
ప్రతి కోడి పొద్దునే కూసి తన వల్లే తెల్లారినట్లు భావించినట్లుగా పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. రైతు మహోత్సవాలకు వచ్చిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు కూడా పసుపు బోర్డు విషయంలో ఇలాగే కామెంట్ చేశారన్నారు. అయితే బోర్డు సాధనకు ఎవరు ఏమి చేశారో అంతరాత్మకు తెలుస్తుందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఆఫీస్ ఏర్పాటుకు వాడకంలో లేని రూరల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ బిల్డింగ్ ఇవ్వమని స్టేట్ గవర్నమెంట్‌కు లెటర్ రాయగా సమాధానం లేదన్నారు. అర్బన్ ఎమ్మెల్మే ధన్పాల్ సూర్యనారాయణ, నేషనల్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్ కులాచారి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి తదితరులుఉన్నారు.