సింహరాశి ముహూర్తంలో.. జనవరి ఒకటో తేదీ వస్తుంది..

సింహరాశి ముహూర్తంలో.. జనవరి ఒకటో తేదీ వస్తుంది..

హిందువులు ఏ పని చేయాలన్నా ముందుగా జాతకం.. ఆరోజు  తిథి.. వారం.. నక్షత్రం చూస్తుంటారు.  ఆరోజు వారికి తారాబలం ఎలా ఉందో పండితులను అడిగి తెలుసుకుంటారు.  దుర్మూహూర్తం.. వర్జం.. యమగండం లాంటి విషయాలపై జనాలు ఆశక్తి చూపుతుంటారు. మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది .  2024 వ సంవత్సరం ఏ ముమూర్తంలో ఎంటరవుతుంది.  శుభా అశుభ సమయాలు ఎలా ఉన్నాయి. 2023 డిసెంబర్​ 31 అర్దరాత్రి  12 గంటలకు ఏ ముహూర్తం ఉంది.. కొత్త సంవత్సరం 2024 జనవరి 1వ తేదీన జ్యోతిష్య నిపుణుల ప్రకారం జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం.

సంవత్సరం: శోభకృత్​ నామ సంవత్సరం
మాసము: మార్గశిర మాసం
తిథి: బహుళపక్షం పంచమి   - Dec 31 11:56 AM – Jan 01 02:28 PM
బహుళపక్షం షష్టి   - Jan 01 02:28 PM – Jan 02 05:11 PM
వారం: సోమవారము
నక్షత్రం: మఖ - Dec 31 05:42 AM – Jan 01 08:36 AM
పూర్వ ఫల్గుణి - Jan 01 08:36 AM – Jan 02 11:42 AM
2024 వ సంవత్సరం జన్మ రాశి: సింహరాశి


శుభ సమయం

అభిజిత్ ముహుర్తాలు - 11:57 AM – 12:41 PM
అమృతకాలము - 04:28 AM – 06:17 AM
బ్రహ్మ ముహూర్తం - 05:13 AM – 06:01 AM

రాహు: - 8:12 AM – 9:34 AM
యమగండం: - 10:57 AM – 12:19 PM
గుళికా: - 1:41 PM – 3:04 PM
దుర్ముహూర్తం:  - 12:41 PM – 01:25 PM మరియు 02:52 PM – 03:36 PM
వర్జ్యం : - 05:38 PM – 07:26 PM

సూర్యోదయము 6:50 AM
సూర్యాస్తమయం 5:48 PM
చంద్రోదయం 6:28 PM
చంద్రాస్తమయం 6:47 AM

కరణం : తైతుల - Jan 01.... 01:10 AM – Jan 01 02:28 PM
గరజి:  - Jan 01.... 02:28 PM – Jan 02 03:49 AM
పణజి -:  Jan 02... 03:49 AM – Jan 02 05:11 PM
యోగం: ఆయుష్మాన్ - Jan 01... 03:40 AM – Jan 02... 04:35 AM

ఇతర వివరాలు

అగ్నివాసము:  - భూమి
చంద్ర వాస్తు: - తూర్పు
దిశ శూలం : తూర్పు- 

2024వ సంవత్సరం సింహరాశి వారికి కళత్ర స్థానములో శని సంచారం మరియు భాగ్య మరియు రాజ్య స్థానములో గురుని సంచారం వలన అనుకూల ఫలితాలు కలుగుచున్నవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సింహరాశికి 2024 ప్రథమార్థంలో గురుని అనుకూలత వలన  ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సామాన్యుల జీవితాలు కొనసాగుతాయి.  ద్వితీయార్థంలో రాజ్య స్థానములో గురుని ప్రభావం చేత  పరిపాలకులకు కొంత ఆటంకం కలుగుతుంది.  ఈ ఏడాది 2024లో వాక్‌ స్థానములో కేతువు ప్రభావం చేత రాజకీయ నేతలు  దూకుడు స్వభావానికి, గొడవలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.