రచీన్ రవీంద్ర.. వరల్డ్ కప్ ముందు వరకు ఈ పేరు క్రికెట్ అభిమానులకు పరిచయం లేదు. కానీ ఎప్పుడైతే ఈ మెగా టోర్నీ ప్రారంభమైందో ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ పేరు మారు మ్రోగిపోతుంది. ఇదిలా ఉండగా.. రచీన్ ఆడుతుంది న్యూజిలాండ్ తరపున అయినా.. వీరి దండ్రులది బెంగళూరు కావడం విశేషం. వృత్తి రీత్యా వీరు అక్కడే స్థిరపడ్డారు. అయితే తాజాగా రచీన్ రవీంద్ర తన సొంత గడ్డ బెంగళూర్ లో మ్యాచ్ ఆడేశాడు. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలవగా.. రచీన్ 3 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేసి రాణించాడు.
ఈ మ్యాచ్ అనంతరం బెంగళూర్ లో తన స్వగృహానికి వెళ్లిన రచీన్ అక్కడ వాళ్ల అమ్మమ్మ చేత దిష్టి తీయించుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ గా మారుతుంది. బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి తన అమ్మమ్మ నుండి ఆశీర్వాదం కోరుతూ కనిపించాడు. చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్ ప్రభావంతో రచిన్ తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతని తల్లిదండ్రులు కూడా క్రికెట్ ప్రేమికులు కావడంతో క్రికెట్ దిగ్గజాలైన రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేరులో సగం రచీన్ రవీంద్రకు పెట్టారు.
ఈ వరల్డ్ కప్ లో అంచనాలకు మించి ఆడుతున్న రచీన్ రవీంద్ర ఆడిన 9 మ్యాచ్ ల్లో 560 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. వరల్డ్ కప్ డెబ్యూలోనే అత్యధిక పరుగులు సెంచరీలు చేసిన ఆటగాడు కూడా రచీన్ రవీంద్ర కావడం విశేషం. ఇందుకేనేమో వాళ్ల అమ్మమ్మ దిష్టి తీస్తూ కనిపించింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read :- ఇంగ్లాండ్‌ను 287 పరుగులతో చిత్తు చేస్తాం.. మా దగ్గర స్పెషల్ ప్లాన్ ఉంది: బాబర్ అజామ్
Rachin Ravindra at his grandparents home in Bengaluru.#AnkitaLokhande CS Naresh Kumar Scam #Bandra #PKMKBForever #Japan #Dhanteras #bbcqt #PKMKBForever #INDvsNED #ROCKYST #TeJran #RachinRavindra #Dhanteras #Japan #GazaHolocaust #JammuAndKashmir #snowfall #Gulmarg #INDvsNZ… pic.twitter.com/eeG7deX2hz
— Ajay Kumar (@Ajaykumar__123) November 10, 2023