Cricket World Cup 2023: న్యూజిలాండ్ బౌలింగ్ .. కేన్ మామ వచ్చేశాడు

వరల్డ్ కప్ లో భాగంగా నేడు న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. చెన్నైలో ఈ మ్యాచు జరగనుండగా.. న్యూజీలాండ్ కెప్టెన్ విలియంసన్ గాయం నుంచి కోలుకోని జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు ఇరు జట్లు రెండేసి మ్యాచులు ఆడగా.. కివీస్ రెండిట్లో విజయం సాధించింది. మరోవైపు బంగ్లా ఆఫ్ఘనిస్తాన్ పై గెలిచి ఇంగ్లాండ్ పై ఓడింది.          

తుది జట్లు:

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్ ), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

Also Read :- దేశం కోసం క్యాన్సర్ ని లెక్క చేయలేదు

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.