- ప్రకటించిన నెక్స్‌జెన్ ఎనర్జియా
న్యూఢిల్లీ: గ్రీన్ డీజిల్ (కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే డీజిల్), కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) పంపులను ఏర్పాటు చేయడానికి రానున్న పదేళ్లలో రూ.15 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని నెక్స్‌జెన్ ఎనర్జియా ప్రకటించింది. మొత్తం 5 వేల సీబీజీ పంపులను ఓపెన్ చేస్తామని పేర్కొంది. ఒక్కో పంపును ఏర్పాటు చేయడానికి రూ.3 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది.
నోయిడాకు చెందిన ఈ కంపెనీ తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని మౌ జిల్లాలో తమ మొదటి సీబీజీ పంపును ఏర్పాటు చేసింది. క్లీన్ ఎనర్జీ సెక్టార్‌లో ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) సర్వీసెస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు రూ. 500 కోట్లకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా, నెక్స్‌జెన్ ఎకర్జియాకు చెందిన ఈ–మొబిలిటీ కంపెనీ ఎన్‌జీఈ తాజాగా రూ.37 వేల ధరకు ఎలక్ట్రిక్ టూవీలర్‌ను లాంచ్ చేసింది.